Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పలు ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. ప్రతి సీజన్ కూడా మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళ్ షోకి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌కి పలువురు ప్రముఖులు తమ సపోర్ట్ ను అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు. నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్ ద బెస్ట్’ అంటూ వీడియో షేర్ చేసింది మిహికా.
అక్షర రెడ్డి మోడల్ అనే సంగతి మనందరికి తెలిసిందే. మిస్ గ్లోబ్ 2019 అవార్డ్ గ్రహీత. ‘విల్లా టు విలేజ్ అనే రియాలిటీ షోలో పాల్గొనగా, కసు మెలా కసు అనే మలేషియన్ మూవీలోనూ తొలిసారి నటించింది. ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో గేమ్ చక్కగా ఆడుతోంది. ఇక మిహికా విషయానికి వస్తే .. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో రానాని వివాహం చేసుకుంది.