సాధారణంగా పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉంటాయి.ఎంతో కలవరపడుతున్నా మనసుకి కూడా పువ్వులు ఎంతో ప్రశాంతతను కల్పిస్తాయి. పువ్వులు ప్రకృతికి అందాన్ని కూడా తెచ్చిపెడతాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రకృతిలో ఎంతో అందమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి పుష్పాలు పుష్పిస్తే వాటిని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఉబలాటపడతారు.మరి ఈ విధంగా 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పించే ఈ పుష్పాలను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటారు.ఇలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కనువిందు చేసే పుష్పాలను నీలకురింజి పుష్పాలు అని పిలుస్తారు.
కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లో ఈ పువ్వులు వికసించాయి.స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి ఈ పుష్పాలు జూలై నుంచి అక్టోబర్ నెల మధ్యలో వికసిస్తాయి.ఈ విధంగా పన్నెండేళ్ళకొకసారి పుష్పించే ఈ పువ్వులను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు.
తాజాగా ఏఎన్‌ఐ ఇటీవల సంతన్‌పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు వికసించి గాలికి కదులుతూ ఉన్నటువంటి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.అదేవిధంగా ఈ పుష్పాల నుంచి సేకరించే తేనె ఎన్నో రకాల వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ పుష్పాల నుంచి సేకరించే తేనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ నీలికురుంజి పుష్పాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…