సాధారణంగా మనం పొరపాటున కింద పడితేనే కాళ్లు చేతులు విరుగుతాయి. అలాంటిది ఆకాశాన్ని తాకే భవనాల నుంచి కిందికి పడితే వారు ప్రాణాలతో బతకడం కష్టం. కానీ ఘజియాబాద్‌లో ఒక మహిళ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 9 వ అంతస్తు నుంచి కింద పడింది. అయితే ఆమె ప్రాణాలు కోల్పోకుండా తీవ్ర గాయాలు పాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికుల కథనం మేరకు ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారిరువురు బయట బాల్కనీలో మాట్లాడుతూ ఉండగా ఆ మహిళ పట్టుతప్పి కిందకు జారింది.ఈ క్రమంలోనే తన భర్త చేయి పట్టుకొని తనను పైకి లాగాలని ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఆ మహిళ 9 వ అంతస్తు నుంచి కింద పడి తీవ్రగాయాల పాలయింది.
https://youtu.be/cZtLuZvSxLM
మహిళా కిందపడగానే తన భర్త స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అంత ఎత్తు నుంచి కింద పడటం వల్ల ఆమె తీవ్రంగా గాయపడటంతో తన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన పొరపాటున జరిగిందా… లేక తన భర్త కావాలనే తన భార్యను పైనుంచి తోసేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.