భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య.. ఇలా కొందరు వేరే వారితో ప్రేమాయణం నడుపుతుంటారు. ఎవరికీ తెలియకుండా ఉన్నంత వరకు ఓకే. కానీ అనుమానం వచ్చినా, తమ జీవిత భాగస్వామికి ఇంకొకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిసినా.. ఆ దంపతుల జీవితం నాశనం అవుతుంది. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో తమ లైఫ్ పార్ట్ నర్స్ వేరే వారితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంటారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోనూ తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ వ్యక్తి తన ప్రియురాలిని కారులో కూర్చోబెట్టుకుని ఓ హోటల్‌కు వచ్చాడు. అయితే అతనిపై ముందు నుంచీ అనుమానంగానే ఉన్న అతని భార్య హోటల్ వరకు అతన్ని ఫాలో అయింది. కారులోంచి అతను దిగగానే ఒక్కసారిగా అతని భార్య పరిగెత్తుకుని వచ్చి అతనిపై దాడికి దిగింది.
https://www.instagram.com/p/CSgffQ4FgpV/?utm_source=ig_embed&ig_rid=099e9881-3249-4f7a-9ade-b6ceff6f8a1f
కారులో కూర్చున్న అతని ప్రియురాలిని బయటకు లాగింది. ఇద్దరిపై ఆమె దాడి చేసింది. ఈమె ఎవరు ? అని ఆ మహిళ తన భర్తను అడుగుతుండడాన్ని కూడా వినవచ్చు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే తరువాత ఏమైందన్న విషయం తెలియదు కానీ.. భర్తను అలా రెడ్ హ్యాండెడ్‌గా ఇంకో మహిళతో పట్టుకున్నందుకు ఆమెను అందరూ అభినందిస్తున్నారు. సరైన పనిచేశామని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చాలా మంది ఇప్పటికే వీక్షించారు.