White Snake: శ్వేతనాగు అంటే తెల్లగా ఉండే పాము. సినిమాల్లో చూపించినట్లు అయితే దానికి మహిమలు ఉంటాయి. అయితే ఆ పాముకు మహిమలు లేవు గానీ.. అది నిజంగా శ్వేత నాగుపామే. కావాలంటే కింద ఇచ్చిన వీడియోలో ఆ పామును మీరు గమనించవచ్చు. దాన్ని ఓ వ్యక్తి ఆడిస్తున్నాడు.
అతని పేరు బ్రయాన్ బార్‌సిజిక్. అమెరికాలోని మిషిగన్‌లో ఉంటాడు. యూఎస్ స్టేట్ ఆఫ్ మిషిగన్‌లోని ఉటికా సిటీలో ఉన్న ఓ జూలో పనిచేస్తున్నాడు. అతను స్వతహాగా పాముల ప్రియుడు. రకరకాల పాములను ఆడిస్తుంటాడు. ఇక జూలో కూడా పాములను సంరక్షిస్తుంటాడు.
https://www.instagram.com/reel/CQYq_QTgyJI/?utm_medium=copy_link
అయితే బ్రయాన్ తెల్లగా ఉండే ఓ జాతికి చెందిన పామును ఆడిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో పాము తెల్లగా ఉండడాన్ని గమనించవచ్చు. అరుదైన జాతికి చెందిన ఆ పామును చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా ? ఇక దాన్ని అతను ఎలా ఆడిస్తున్నాడో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.