ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్ డౌన్ లను నిర్వహిస్తోంది. అయితే కొంత మంది యువత ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతూ పోలీసులకు కనపడుతున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు వారికి జరిమానాలు విధించడం లేదా పనిష్మెంట్ ఇవ్వడం చేస్తున్నారు.
ముఖ్యంగా అబ్బాయిలు నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి శిక్షిస్తూ అమ్మాయిలను వదిలేస్తున్నారు.ఈ సమాజంలో అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ సమానమే నిబంధనలు ఉల్లంఘించిన ఎవరికైనా శిక్ష విధించాలని ప్రశ్నిస్తున్న తరుణంలో పోలీసులు అమ్మాయిలకి కూడా పనిష్మెంట్ ఇచ్చారు.మధ్యప్రదేశ్‌లోని చందేరీ జిల్లాలో అమ్మాయిలకు పనిష్మెంట్ ఇవ్వడంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చందేరీ జిల్లా వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించి 144 సెక్షన్ రూల్స్ అమలయ్యేలా చేస్తున్నారు. ఇంతలో ఈ అమ్మాయిలు పనీ పాటా లేకుండా ఉత్తినే తిరుగుతుంటే పోలీసులు ఆపారు ఎందుకు బయట తిరుగుతున్నారని ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని మందలించి వారికి పనిష్మెంట్ గా గుంజీళ్లు తీయాలని చెప్పారు. దీంతో అమ్మాయిలు ఇంకోసారి ఇలా జరగదు సార్ ప్లీజ్.. అంటూ బతిమిలాడినా పోలీసులు వినకుండా వారితో గుంజీళ్లు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.