Viral Video : ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో కనపడే వీడియోలు, చాలా విచిత్రంగా ఉంటాయి. క్షణాల్లో ఇలాంటి వీడియోలు, వైరల్ అయిపోతూ ఉంటాయి. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేని సందర్భాలు, ఒక్కొక్కసారి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది ముంబై తానేలో చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్ కిటికీ దగ్గర పెద్ద పాము కనబడింది. ఇద్దరు ధైర్యవంతులు ఆ పాము నుండి అందర్నీ కాపాడారు. ఇక, దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స లో ఈ వీడియో, ప్రస్తుతం వైరల్ అవుతోంది.
స్నేహా అనే యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఈ పాముని ఇద్దరు వ్యక్తులు తొలగించి, అందర్నీ కూడా కాపాడారు. ఇంత భారీ పాముని సురక్షితంగా తొలగించడం మామూలు విషయం కాదు. నిజంగా వాళ్ల ధైర్యాన్ని చూసి మెచ్చుకోవాల్సిందే. స్నేహ అనే ఆమె దీనిని షేర్ చేశారు. బిల్డింగ్ కిటికీ దగ్గర ఇంత పెద్ద పాము కనపడింది. ఇద్దరు ధైర్యవంతులు విజయవంతంగా పాముని తొలగించారు.
మూడు లక్షల కి పైగా వ్యూస్, ఈ వీడియో కి వచ్చాయి. ఈ వీడియోని చూసి, ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇంత పెద్ద పాము ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇక కామెంట్లలో కూడా విచిత్రమైన కామెంట్లు వచ్చాయి. కొన్ని కామెంట్లు కూడా చూద్దాం.. ఒక వ్యక్తి ”పాము నుండి అందరినీ కాపాడిన వాళ్ళకి కుడోస్ అని అన్నారు.
అలానే, చాలా పెద్ద పాము ఇది” అని కామెంట్ చేశారు. ఇంకొక వ్యూయర్ అయితే, ”పాము నుండి ఈ ధైర్యవంతులు మొత్తం ఊరునే కాపాడారు” అంటూ కామెంట్ చేశారు. ఇంకొక యూజర్ అయితే, ”చాలా భయంకరమైన వీడియో. ఇంత భయంకరమైన వీడియో ఎప్పుడూ చూడలేదు” అంటూ కామెంట్ చేశారు. ఇలా ఎవరికి నచ్చిన కామెంట్లు వాళ్ళు చేశారు.
Thane | Massive snake hanging from a building #viral pic.twitter.com/Q8pIckKzzO
— Neharika Sharma (@neharikasharmaa) September 26, 2023