సాధారణంగా మనం ఒక ఇంటిని నిర్మించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకోవడమే కాకుండా, ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఆకాశాన్ని తాకే మేడలను నిర్మించాలంటే ఇంకెంత సమయం, డబ్బు ఖర్చు అవుతుందో మనం ఊహించుకోవచ్చు. ఈ విధంగా చైనాలో బిల్డింగులు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ బిల్డింగులను చూడాలంటే పూర్తిగా మన తలను పైకెత్తాల్సి ఉంటుంది. అలాం
టి ఎత్తయిన బిల్డింగులు కనురెప్పపాటు సమయంలో నేలమట్టం అయ్యాయి అంటే వినడానికి, చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది.
చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 15 అత్యంత ఎత్తైన బిల్డింగులు కేవలం 45 సెకన్లలో నేలమట్టమయ్యాయి. అయితే అధికారులు ఈ భవనాలను ఎందుకు కూల్చివేశారన్న విషయం తెలియదు గానీ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బిల్డింగులను కూల్చడానికి అధికారులు ఎంతో పటిష్టమైన భద్రత చేపట్టారు.
https://twitter.com/fawfulfan/status/1438097980276584448?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438097980276584448%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugustop.com%2Fviral-video-15-buildings-gets-collapsed-in-just-45-seconds-in-china-e0b0b5e0b188e0b0b0e0b0b2e0b18d-e0b0b5e0b180e0b0a1e0b0bfe0b0afe0b18b
ఈ బిల్డింగులను కూల్చడం కోసం ఏకంగా 4.6 టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. రెండు వేలకు పైగా రెస్క్యూ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, 8 అత్యవసర రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచి సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి ఈ బిల్డింగులను కూల్చేశారు. ఈ బిల్డింగులను కూల్చడానికి గల కారణం ఏమిటనే విషయం తెలియక పోయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.