సాధారణంగా పామును చూస్తే భయంతో ఆమడ దూరం పరిగెత్తుతాము. కానీ కొంతమంది మాత్రం ఎంతో ధైర్యంగా ఆ పాములను అక్కడి నుంచి పంపించడం లేదా వాటిని చంపేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎన్నో పాములు బయట ఉంటాయి. అయితే ఈ విధంగా కనిపించిన పాములను మనం ఏం చేయకపోతే వాటి మానాన అవి వెళ్లిపోతాయి. మన నుంచి వాటికి ఏదైనా ప్రమాదం కలుగుతుందని భావించినప్పుడే అవి మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.
ఈ క్రమంలోనే ఓ పాము ఓ మహిళ ఇంటిలోకి వెళ్ళింది. అయితే ఆ పామును చూసిన ఆమె ఏమాత్రం బెదరకుండా ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ పామును చంపకుండా ఎంతో చాకచక్యంగా తన ఇంటి నుంచి బయటకు పంపింది. ఈ క్రమంలోనే ఈ సంఘటనను కొందరు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Don’t know who this compassionate woman is but hats off to her for her handling of the snake with three Cs – Cool, Calm and collected. We need more people like her who respect wildlife 👍🙏#Respectwildlife vc-shared pic.twitter.com/ZLQAE3B3C3
— Supriya Sahu IAS (@supriyasahuias) September 6, 2021
ఈ వీడియోలో ఓ మహిళ చేతిలో పెద్ద కర్ర తీసుకున్నప్పటికీ ఆ పామును చంపకుండా దానిని బయటకు పంపించింది. అలా బయటకు వెళ్ళిన పాము పడగ విప్పి ఆ మహిళను హెచ్చరించినట్టుగా తన వైపు అలా చూస్తూ వెనక్కి పాకుతూ వెళ్లింది. ఈ పాము ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ జంతువులను చంపకుండా వాటి నుంచి ప్రమాదం బారిన పడకుండా ఎంతో చాకచక్యంగా ప్రవర్తించిందంటూ సదరు మహిళ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.