ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దీంతో ఈ విషయం అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అక్కడి చందౌలి జిల్లాలో ఆవుకు రెండు తలల దూడ జన్మించింది. దానికి రెండు నోళ్లు, రెండు చెవులు, నాలుగు కళ్లు ఉన్నాయి. అరవింద్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన ఆవుకు ఆ దూడ జన్మించింది. అయితే ప్రస్తుతం ఆవు, దూడ రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి.
ఈ సందర్భంగ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం ఆ దూడ జన్మించిందని తెలిపాడు. దాన్ని చూసి తమ కుటుంబమంతా ఒక్కసారిగా షాక్‌కు గురైందన్నాడు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా వ్యాపించింది. దీంతో దూడను చూసేందుకు గ్రామస్థులు తండోప తండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దూడ అలా జన్మించడంతో దాన్ని దైవానికి ప్రతి రూపమని భావిస్తున్నారు. దానికి పూజలు చేస్తున్నారు.
అయితే వెటర్నరీ వైద్యులు మాత్రం ఇలా అత్యంత అరుదుగా జరుగుతుంటుందన్నారు. దీనిపై చందౌలి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ సత్య ప్రకాష్ మాట్లాడుతూ ఆవు గర్భంలో అసాధారణ రీతిలో కణాలు పెరగడం వల్ల ఇలా జరుగుతుందని, అంతే కానీ దూడ ఏమీ దైవం కాదని కొట్టి పారేశారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం ఆ దూడను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…