భార‌త‌దేశం

చిన్నారుల‌ను కోవిడ్ నుంచి ర‌క్షించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల జారీ..!

దేశంలో కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతుండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు మూడో వేవ్‌పై దృష్టి పెట్టాయి. మూడో వేవ్‌లో ఎక్కువ‌గా చిన్నారుల‌కు కోవిడ్ ప్ర‌మాదం ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుండ‌డంతో చిన్నారుల‌కు చికిత్స అందించేందుకు హాస్పిట‌ళ్ల‌ను సిద్ధం చేస్తున్నారు. వారి కోసం ఐసీయూ బెడ్ల‌ను, ఇత‌ర స‌దుపాయాల‌ను పెంచుతున్నారు. అయితే కోవిడ్ నుంచి చిన్నారుల‌ను ర‌క్షించేందుకు గాను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

చిన్నారుల‌కు కోవిడ్ సోకిన‌ప్ప‌టికీ వారిలో అంత తీవ్ర‌త ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. చాలా మందికి స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాల‌తో కోవిడ్ సోకుతుంది క‌నుక వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌వ‌చ్చు. కానీ ఊబ‌కాయం, టైప్ 1 డ‌యాబెటిస్, క్రానిక్ కార్డియో ప‌ల్మ‌న‌రీ డిసీజ్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండే చిన్నారుల‌కు కోవిడ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక అలాంటి వారి ప‌ట్ల త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త వ‌హించాలి.

చిన్నారులు క‌చ్చితంగా వ్య‌క్తిగత ప‌రిశుభ్ర‌త‌ను పాటించేలా త‌ల్లిదండ్రులు చ‌ర్య‌లు తీసుకోవాలి. వారిచే మాస్కుల‌ను ధరింప‌జేయాలి. భౌతిక దూరంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి. చేతుల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రం చేసుకునేలా ప‌ర్య‌వేక్షించాలి. చిన్నారుల‌ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించ‌కూడ‌దు. ఇండోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్స‌హించాలి. బయట పిల్ల‌ల‌తో తిర‌గ‌నివ్వ‌కూడ‌దు. ఇంట్లో వృద్ధులు ఉంటే పిల్లల ద్వారా వారిక కోవిడ్ సోకే ప్ర‌మాదం ఉంటుంది క‌నుక ఆ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. వృద్ధుల‌కు పిల్ల‌ల‌ను దూరంగా ఉంచే ప్ర‌య‌త్నం చేయాలి.

చిన్నారుల్లో ఏవైనా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌రాదు. వెంట‌నే ప‌రీక్ష‌లు నిర్వ‌హించి చికిత్స‌ను అందించాలి. వారికి పౌష్టికాహారం ఇవ్వాలి. గోరువెచ్చ‌ని నీటిని తాగించాలి. ప్రాణాయం, ధ్యానం చేసేలా ప్రోత్స‌హించాలి. ప‌సుసు క‌లిపిన పాలు, చ్య‌వ‌న్ ప్రాశ్ రోజూ ఇవ్వాలి. జంక్ ఫుడ్‌ను మానేసే విధంగా చూడాలి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఇవ్వాలి. ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే కోవిడ్ బారి నుంచి చిన్నారుల‌ను ర‌క్షించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM