ఈ మధ్య ప్రతి ఒక్కరిపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు. ఎక్కడో జరిగిన వింతలు, విశేషాలు ఇలా ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి తెలిసిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారింది.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో తన అభిమానులతో మరింత దగ్గరగా ఉన్నాడు. ఇక ఆయన ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలను, ఫోటోలను పంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో ఫన్నీ వీడియోను పంచుకోగా వైరల్ గా మారింది.
అందులో ఓ బుడ్డోడు గేదె పైకి ఎక్కి స్నానం చేస్తున్నాడు. అంతేకాకుండా డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ వీడియోకు ఓ పాట కూడా ఎడిట్ చేయగా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ఈ వీడియోతోపాటు ఓ విషయాన్ని పంచుకున్నాడు. గ్రామాల్లో జీవితం సరదాగా ఉంటుందని.. పట్టణాల్లో ఉండే వారికి ఇలాంటి సరదాలు ఉండవని తెలిపాడు.