సాధారణంగా అప్పుడప్పుడు కొంతమందికి వింత శిశువు జన్మించడం గురించి మనం వినే ఉంటాం. ఈ విధంగా ఆ శిశువులు జన్మించడానికి గల కారణం జన్యు లోపం అని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలోని బరంపురంలో 30 సంవత్సరాల మహిళ ఓ వింత శిశువుకు జన్మనిచ్చింది. పంది రూపంలో ముఖం ఉండడంతో పాటు, ఒళ్లంతా పొలుసులతో జన్మించిన ఆ బిడ్డను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.
ఈ బిడ్డ ఆ విధంగా వింత రూపంలో జన్మించడానికి గల కారణం హార్లేక్విన్ ఇచ్థియోసిస్ (Harlequin Ichtyhyosis) అనే అరుదైన జన్యు సమస్య వల్ల ఆ బిడ్డ ఈ విధంగా జన్మించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వింత ఆకారంలో బిడ్డ జన్మించడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుందని ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
పలు అధ్యయనాల ద్వారా ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న పిల్లలు ప్రతి పది లక్షల మందిలో ఒకరు జన్మిస్తారని. ఈ విధమైన ఆకారంలో పుట్టిన వారు కొద్ది రోజులలోనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు..