అసలే కరోనా కష్టకాలం. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అలాంటి వారిపై వీలైతే కనికరం చూపించాలి. కానీ కర్కశత్వం కాదు. ఆ పోలీస్ ఆఫీసర్ అలాగే చేశాడు. రహదారి పక్కన బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ క్రమంలో అతని తోపుడు బండిని కాలితో తన్నాడు. దీంతో దానిపై ఉన్న కూరగాయలు అన్నీ నాశనం అయ్యాయి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
పంజాబ్‌లో మే 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను విధించారు. నిత్యావసరాలు, అత్యవసరం అయ్యే వస్తువులు, సరుకులను మాత్రమే అమ్మేందుకు అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ ఓ వ్యక్తి తన తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటుంటే అతనిపై అక్కడి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నవదీప్ సింగ్ కించిత్ జాలి చూపించలేదు. ఆ తోపుడు బండిని కాలితో తన్నాడు.
Absolutely shameful and unacceptable. I have suspended SHO Phagwara. Such misbehaviour will not be tolerated at any cost and those who indulge in it will have to face serious consequences. https://t.co/terAynz6ao
— DGP Punjab Police (@DGPPunjabPolice) May 5, 2021
అయితే ఆ వీడియో వైరల్ అయిన అనంతరం విషయం ఆ రాష్ట్ర డీజీపీ వరకు వెళ్లింది. దీంతో డీజీపీ దినకర్ గుప్తా నవదీప్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఇక ఆ సంఘటన జరిగిన ఫగ్‌వారా ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు తమ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని సేకరించి ఆ వ్యక్తికి నష్ట పరిహారం కింద అందజేశారు.