వైర‌ల్

కుక్క‌ల‌కు, గుర్రాల‌కు పెన్ష‌న్ ఇస్తున్న దేశం.. ఎందుకంటే..?

మనదేశంలో పెన్షన్ అంటే కేవలం వికలాంగులు, వృద్ధులకు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే సహకారం అని చెప్పవచ్చు.ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ అందించడం గురించి మనం వినే ఉంటాం. కానీ ఎప్పుడైనా గుర్రాల, కుక్కలకు పెన్షన్ అందించడం గురించి విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా పోలాండ్ దేశంలో ప్రభుత్వ విధులలో సహకరించిన గుర్రాలకు, శునకాలకు పెన్షన్ ఇవ్వబోతోంది. ప్రభుత్వ విధుల్లో అధికారులకు సహకరించిన జంతువులకు అధికార హోదా ఇచ్చి, పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించే ఆలోచనలో పోలాండ్ ప్రభుత్వం ఉంది.

పోలాండ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి త‌మ లెజిస్లేష‌న్ ముందు త్వ‌ర‌లో ఈ బిల్లుని ప్ర‌వేశ‌పెట్టాల‌ని అనుకుంటున్నారు. ఈ బిల్లు చట్టపరంగా రూపుదిద్దుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధులలో సేవలందిస్తున్న 1200 శునకాలకు, 60 కి పైగా గుర్రాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ అందుతుంది.ఈ విధంగా జంతువులు విధినిర్వహణలో ఉన్నప్పుడు వాటి పని ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది. ప్రతి ఏడాది పది శాతానికి పైగా జంతువులు పదవీ విరమణ పొందుతాయి. విధులు నిర్వహిస్తున్న సమయంలో వాటి పని ఎంతో కష్టంతో ఉండటం వల్ల పదవీ విరమణ తర్వాత వాటికి చికిత్స ఎంతో అవసరం.

పోలాండ్ లో పదవీ విరమణ పొందిన జంతువుల కోసం ప్రత్యేకంగా “ది వెట‌ర‌న్స్ కార్న‌ర్‌” అనే ఒక్క షెల్ట‌ర్ హోమ్ ఉంది. స్లవోమీర్ వాల్కోవియ‌క్ అనే 50 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ దీనిని నడుపుతున్నారు. నెల నెలా వీటి ఆహారానికి, చికిత్సకు వేలాది డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కనుక పదవీ విరమణ తర్వాత వీటి బాధ్యతలను చూసుకోవడం కోసం వీటికి ప్రభుత్వం పెన్షన్ ను అందించడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన అవసరం ఉందని పోలాండ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలియజేశారు.

Share
Sailaja N

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM