కొన్నిసార్లు సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఎన్నో వింతైన చేపలు వలలో పడుతుంటాయి. అయితే ఈ చేపలు మార్కెట్లో అధిక ధరకు అమ్ముడపోతూ జాలర్లను ఒక్కసారిగా లక్షాధికారులను చేస్తుంటాయి. తాజాగా ఈ విధమైన ఓ అరుదైన చేప బెంగాల్‌లోని దిఘా సముద్ర జలాల్లో ఓ జాలరి వలలో చిక్కుకుంది. ఈ చేపను తీసుకువచ్చి మార్కెట్లో తూకం వేయగా 800 కిలోల బరువు ఉంది.
ఈ అరుదైన చేప చూడటానికి స్ట్రింగే చేప ఆకారంలో కనిపించినప్పటికీ ఈ చేపను తెలుగులో టేకు చేప, తిమ్మిరి చేప అని పిలుస్తారు. బెంగాల్ సముద్రతీరంలో ఈ విధమైన చేపలను శంకర్ చేపలు అని కూడా పిలుస్తారు. ఆ జాలరికి ఈ చేపతోపాటు మరో బాఘా శంకర్ ఫిష్ అనే చేప కూడా దొరికింది. ఆ జాలరి పట్టిన ఈ చేపలలో ఒక దాన్ని కోల్ కతాలోని చాన్ అండ్ కంపెనీ రూ.40 వేలకు కొనుగోలు చేసింది.
రిషికేశ్ శ్యామల అనే మరో వ్యాపారి ఇంకొక చేపను రూ.25 వేలకు కొనుగోలు చేశాడు. అయితే ఈ చేప వింత ఆకారంలో ఉండడంతో దాన్ని చూసి భయపడ్డారు. కానీ ఎంతో ధైర్యంతో ఈ చేపలను పట్టుకుని మార్కెట్ కి తీసుకువచ్చారు. ఈ అరుదైన జాతికి చెందిన చేపలలో ఉండే పదార్థాలతో వివిధ రకాల మందులు, సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తారు. అందువల్ల వీటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఇలాంటి చేపలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…