క్రికెట్, సినిమా సెలబ్రిటీలు ఒకరినొకరు కలిస్తే నిజంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజే. తమ అభిమాన ప్లేయర్లు, నటులను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ సంబర పడిపోతుంటారు. ఇక తాజాగా అలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్‌ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కలిశాడు.
విజయ్ బీస్ట్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండగా ఆయనను ధోనీ కలిశాడు. గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉన్న గోకులం స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా ధోనీ కూడా అక్కడే షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు. త్వరలోనే రెండో దశ ఐపీఎల్ 2021 జరగనుంది. దీంతో ఓ యాడ్ చిత్రీకరణ కోసం ధోనీ చెన్నైలో ఉన్నాడు. అందులో భాగంగానే విజయ్‌ను ధోనీ కలిశాడు.
కాగా వారిద్దరూ కలిసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.