ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎంతో మంది పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. సాధారణంగా కొన్ని పెళ్లిళ్లలో పలు వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని వీటిలో హాస్యాస్పదంగా ఉంటే మరికొన్ని తీవ్ర వివాదాలకు కారణం అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని హమీర్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో పాల్గొన్న వధూవరుల పై వరుడు తల్లి తన కొడుకును చెప్పుతో కొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
యూపీలోని హమీర్ పూర్ జిల్లాలో జరిగింది. కాగా, భరువా సుమేర్ పూర్ గ్రామానికి చెందిన ఉమేష్ చంద్ర, అదే గ్రామానికి చెందిన అంకిత ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని వీరి ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలోనే వీరి ప్రేమపెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఉమేష్ అంకిత ఇంటిలో నుంచి వెళ్లిపోయి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్న ఈ జంటను అంకిత తల్లిదండ్రులు వారి కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి వారి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
#A4Times#हमीरपुर
दूल्हे की माँ ने जयमाल के वक्त बेटे पर चप्पल से किया हमला, वीडियो वायरल,
माँ को यह रिश्ता मंज़ूर नहीं था,
सुमेरपुर थाना क्षेत्र में एक मैरेज हाल का है वीडियो.#ViralVideo #marriage pic.twitter.com/sVO6pDSndr— A4Times (@a4_times) July 4, 2021
ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు గ్రామస్తులు అందరినీ ఆహ్వానించారు కానీ ఉమేష్ తల్లిదండ్రులను ఆహ్వానించలేదు. దీంతో ఉమేష్ తల్లిదండ్రులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివాహ రిసెప్షన్ లో జై మాల కార్యక్రమం సాగుతుండగా వధూవరులు ఇద్దరినీ కమలం పువ్వులాంటి సింహసనాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది చుట్టుతిరుగుతూ ఉంటుంది.ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది అతిథులు ఎంతో ఆసక్తిగా వేడుకను చూస్తుంటే ఉమేష్ తల్లి ముసుగులో వచ్చి ఉమేష్ పై చెప్పుతో దాడి చేసింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండగా.. చివరికి అక్కడున్న వారు ఆ ముసుగులో ఉన్న మహిళను కిందకు దించి ముసుగు తీసి చూడగా అందరికీ అసలు విషయం అర్థమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.