అమ్మతనం అనేది ప్రతి స్త్రీకి ఎంతో గొప్ప వరం. అయితే అమ్మ అయ్యే సమయంలో ఆ స్త్రీ ఎన్ని బాధలను పడుతుందో ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది. తన బిడ్డ కోసం ఆ బాధలన్నింటినీ ఎంతో ఆనందంగా భరిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీ ఏ విధంగా కష్టాలను భరిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలంతో టిక్‌టాకర్ ఒక ప్రయోగం చేశాడు. ప్రస్తుతం ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెయిట్ ల్యాండ్ హాన్లీ అనే ఒక ప్రముఖ టిక్‌టాకర్ తన పొట్టకు పెద్ద పుచ్చకాయను ప్లాస్టర్ సహాయంతో గట్టిగా చుట్టుకున్నాడు. అదేవిధంగా తన ఛాతీ చుట్టూ కూడా రెండు పుచ్చకాయలను కట్టుకొని గర్బిణీ వేషధారణ వేశాడు. ఈ క్రమంలోనే అతడు బెడ్ పై పడుకొని లేవడానికి ప్రయత్నించాడు. అయితే అతను బెడ్ పై నుంచి పైకి లేవడానికి వీలు కాలేదు. అలాగే బాత్రూం వెళ్లడం, షూ ధరించడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాలేదని ఆ తర్వాత హాన్లీ తెలియజేశాడు.
ఈ విధంగా గర్భిణీ వేషధారణలో ఉన్న ఆ వ్యక్తి గర్భిణీల బాధను తెలుసుకోవాలని చేసిన ప్రయోగం అతనికి జ్ఞానోదయం కలిగించింది. నిజంగా గర్భం ధరించిన మహిళలు ఎంతో బాధను అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వేషధారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…