ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడపాల్సి ఉంటుంది. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు ఫైన్ వేస్తారో తెలియదు. ఎప్పుడు వాహనాలను టోయింగ్ చేసి తీసుకెళ్తారో తెలియదు. ఆ వ్యక్తికి కూడా అలాగే జరిగింది. కానీ అక్కడే వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పూణెలోని నానాపేట్ ఏరియాలో నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై అక్కడి సమర్థ్ ట్రాఫిక్ బ్రాంచ్ పోలీసులు కొరడా ఝులిపించారు. వాహనాలను అన్నింటినీ టోయింగ్ చేసి తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ వ్యాన్‌పైకి ఎక్కించారు. అయితే వాటిల్లో ఓ టూవీలర్‌కు చెందిన వ్యక్తి తన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్తుండడం చూసి భరించలేక ఏకంగా వ్యాన్ మీదకు ఎక్కాడు.
#WATCH | Maharashtra: A motorcycle was towed in Pune y'day while its rider was sitting on it
DCP Traffic says, "Bike was parked in no parking. When our officials towed it, owner came &sat on it. He was requested to get down. Later he did & accepted his mistake. He paid the fine" pic.twitter.com/987qnbTPtu
— ANI (@ANI) August 20, 2021
వ్యాన్ మీదకు అప్పటికే ఎక్కించిన తన టూవీలర్‌పై అతను కూర్చుని చాలా సేపు కిందకు దిగలేదు. పోలీసులు ఎన్నో సార్లు అతనికి కిందకు దిగాలని చెప్పారు. అయినప్పటికీ అతను కిందకు రాలేదు. ఇక కొంత సేపటి తరువాత అతను మనసు మార్చుకుని కిందకు దిగి ఫైన్ కట్టాడు. వాహనాన్ని అతనికి పోలీసులు అప్పగించారు. అతను క్షమాపణలు కూడా చెప్పాడు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది.