గర్భం ధరించిన మహిళలు ఆ విషయాన్ని తమ భర్తలకు ఎంతో సంతోషంగా చెబుతారు. దీంతో వారు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. మొదటిసారి అయితే తాము తండ్రి అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తారు. తరువాత కూడా భార్య గర్భం దాలిస్తే సంతోషిస్తారు. అయితే అతనికి మాత్రం తన భార్య గర్భం దాల్చినందుకు సంతోషం కాదు కదా.. తీవ్రమైన మనస్థాపం కలుగుతోంది. ఎందుకంటే..
ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టాడు. అందులో తన వివరాలను వెల్లడించాడు. తాను 2 ఏళ్ల కిందట వేసక్టమీ చేయించుకున్నానని, అయితే తన భార్య ప్రస్తుతం గర్భవతి అని తెలిపాడు. తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఇప్పుడు తన భార్య గర్భవతి అవడం ఏమిటని.. అతను అందులో పేర్కొన్నాడు.
అయితే ఎన్నో ఏళ్ల నుంచి తన భార్యతో సంతోషంగానే ఉంటున్నానని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అందువల్ల తన భార్య తనను మోసం చేస్తుందని భావించడం లేదని.. ఈ విషయంలో ఏం చేయాలో సూచనలు చెప్పండి.. అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో నెటిజన్లు భిన్న రకాలుగా సలహాలు ఇస్తున్నారు.
భార్యను మోసం చేయవద్దని, విధిని అంగీకరించి సంతోషంగా ఉండమని కొందరు సలహా ఇచ్చారు. అయితే కొందరు మాత్రం బిడ్డ పుట్టే వరకు ఆగి డీఎన్ఏ టెస్టు చేయించమని చెప్పారు. ఇంకొందరు వేసక్టమీ ఫెయిల్ అయి ఉండవచ్చు. అంతమాత్రాన కంగారు పడాల్సిన పనిలేదు. ఇది సహజంగానే జరుగుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. భార్యను విడిచిపెట్టకు.. అని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అతని పోస్టు వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…