హిందువుల పండుగలలో అతి ముఖ్యమైన వాటిలో వినాయకచవితి ఒకటి. వినాయక చవితిని అందరూ ఎంతో వేడుకగా, ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు ఆ గణనాథుడికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించి, వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. ప్రతి ఏడాది భాద్రపద శుక్ల చతుర్థి సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అసలు వినాయక చవితి జరుపుకోవడానికి కారణం ఏమిటి ? ఈ పండుగ విశిష్టత ఏమిటి ? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం స్వర్గలోకంలో దేవతలందరూ కలిసి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు. ఈ క్రమంలోనే దేవతలందరూ పార్వతీ పరమేశ్వరులతో మనం ఏ కార్యం చేసినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజించడానికి ఒక దేవుడిని నియమించండి అంటూ వేడుకుంటారు. అదే సమయంలో అక్కడే ఉన్న పార్వతి తనయులు అందుకు మేము అర్హులమనీ పోటీగా ముందుకొస్తారు. ఈ క్రమంలోనే పరమేశ్వరుడు వారిద్దరికీ ఒక పోటీ పెట్టి ఇందులో ఎవరు విజయం సాధిస్తే వారే అందుకు అర్హులు అని చెబుతారు. మీలో ఎవరైతే లోకంలోని పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారే ఇందుకు అర్హులని చెప్పడంతో వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలలోని నదులను సందర్శించడానికి వెళ్తాడు.
ఈ క్రమంలోనే వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యం అని తన తండ్రిని అడగగా.. అప్పుడు పరమేశ్వరుడు తనకి నారాయణ మంత్రాన్ని జపించమని తెలియజేస్తాడు. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపిస్తే మూడు వందల కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్టవుతుందని తెలియజేయడంతో వినాయకుడు అక్కడే ఉన్న తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నారాయణ మంత్రాన్ని చెప్పుతాడు. ఈ క్రమంలోనే కార్తికేయుడు ముల్లోకాలన్నింటినీ తిరిగి కైలాసం చేరుకునేలోపే అక్కడ వినాయకుడు ఉండడాన్ని చూస్తాడు. దీంతో చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెబుతాడు. అలా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు.
ఈ విధంగా ఎవరైతే ఏదైనా శుభకార్యం తలపెట్టే ముందు వినాయకుడి పూజ చేస్తారో ఆ కార్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందని భావించి వినాయకుడి పూజ చేస్తారు. అలా వినాయక చవితి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి వినాయకుడి కథ చదువుతూ ఈ పండుగను జరుపుకుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…