వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కుక్కలు ఎగబడితే తప్పించుకోవచ్చు. కానీ కొన్ని సార్లు వాటి నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంది. అయితే అటవీ ప్రాంతాల్లో వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే వన్య ప్రాణులు ఎగబడితే తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది. ఓ వ్యక్తికి కూడా అలాగే జరిగింది. కానీ అదృష్టవశాత్తూ అతను ఎలాగో తప్పించుకోగలిగాడు.
మాంటానా అనే ప్రాంతంలో కొండ నుంచి కిందకు ఓ మౌంటెయిన్ బైక్ మీద ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. అతని వెనుక ఓ ఎలుగుబంటి తరుముకొచ్చింది. అతన్ని వెంబడించింది. దీంతో అతను భయపడకుండా బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో అతను ఆ ఎలుగుబంటి నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగాడు. అతను బైక్ మీద ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఓకే. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది.
ఇక ఆ సమయంలో తీసిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. దాన్ని ఇప్పటికే చాలా మంది వీక్షించారు. చాలా చాకచక్యంగా అతను తప్పించుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.