ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సంఘటనలకు సంబంధించిన విషయాలు క్షణాలలో ప్రపంచం మొత్తం చూసేలా చేస్తున్నాయి. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సమాజంలో జరిగే కొన్ని ఘటనలు గురించి అందరూ తెలుసుకోగలుగుతున్నారు. తాజాగా నడిరోడ్డుపై ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువతి చేసిన హంగామా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సదరు యువతి ప్రవర్తనకు #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.అయితే ఇది ఎప్పుడు జరిగింది అనే విషయం క్లారిటీ లేకపోయినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి సదరు వ్యక్తి పట్టుకొని ఇష్టానుసారంగా కొట్టింది. ఈ యువతి ఆ వ్యక్తి పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఆ యువతి సదరు వ్యక్తిని చితకబాదడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ తో సహా పలువురు మాట మాట్లాడకుండా చోద్యం చూస్తూ ఉన్నారు.
ఈ విధంగా సదరు యువతి అతనిని కొట్టడానికి కారణం ఏమిటని అడుగుతూ ఉండగా అతని ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది. ఈ క్రమంలోనే మరో వ్యక్తి ఈ దారుణం అడ్డుకోవడానికి రావడంతో అడ్డుగా వచ్చిన వ్యక్తి కాలర్ పట్టుకొని అతన్ని లాగి మరి కొట్టింది.అర్ధరాత్రి సమయంలో వీరి వ్యవహారంతో ట్రాఫిక్ జామ్ కాగా అక్కడున్న వారందరూ ఈ అమ్మాయి కి ఏమైంది అంటూ అరవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ యువతిని సదరు వ్యక్తి ఢీకొట్టడంతో తనపై ఈ విధంగా ప్రవర్తించినట్లు ఆమె మాట తీరును బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఆ వ్యక్తి పట్ల సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో హ్యాష్ ట్యాగ్ కొనసాగుతోంది. ఇంతకు అక్కడ ఏం జరిగింది అనే విషయం గురించి పోలీసులు ఆరా తీయాల్సిన ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…