సాధారణంగా శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే ఎవరికైనా సరే అతి దాహం, ఆకలి కలుగుతాయి. దీంతో షుగర్‌ను నియంత్రించుకునేందుకు మందులను వాడుతారు. అయితే ఆ బాలుడికి ఈ విషయం తెలియదు. దీంతో అతను తనకు షుగర్ ఉందని తెలియకపోవడంతో రోజుకు ఏకంగా 40 చపాతీలు తిన్నాడు. చివరకు హాస్పిటల్ పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌కు చెందిన 12 ఏళ్ల సందీప్ అనే బాలుడు ఉన్నట్లుండి రోజుకు 40 చపాతీలు తినడం మొదలు పెట్టాడు. సడెన్ గా కంటి చూపు పోయింది. ఒక రోజు అతను స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తండ్రి బన్వరి అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేయగా ఆ బాలుడికి షుగర్ 1206 ఉన్నట్లు వచ్చింది. దీంతో వైద్యులే షాకయ్యారు.
అయితే ఆ బాలుడికి రోజుకు 6 యూనిట్ల ఇన్సులిన్ ను ఇచ్చారు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోకి వచ్చాయి. ఈ క్రమంలో అతను స్పృహలోకి వచ్చాడు. అయితే షుగర్ ఎక్కువ కావడం వల్ల కంటి చూపు పోయింది. దీంతో వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…