సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు అక్రమ సరుకు రవాణా చేస్తున్నటువంటి వాహనాలను ఆపి వారికి జరిమానా విధించే జరిమానాలు వసూలు చేయడం వరకు మనకు తెలిసిందే. అయితే ఈ పోలీసులు మాత్రం అవినీతికి పాల్పడి ఏకంగా అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాహనాల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అద్భుతమైన ఇంటిని నిర్మించారు. అయితే పోలీసులు ఇలా అవినీతికి పాల్పడింది మన దేశంలో మాత్రం కాదు.
రష్యాలోని దక్షిణ స్టవ్రోపల్ ప్రాంతం ట్రాఫిక్ పోలీస్ హెడ్ కల్ అలెక్సీ సఫోనోవ్, మరో కొందరు పోలీసు అధికారులు అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. వారు ఉంటున్న పోలీస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్దఎత్తున లంచాలు తీసుకుంటూ ఆ డబ్బుతో ఇంద్ర భవనాన్ని నిర్మించారు.అలెక్సీ సఫోనోవ్ ఇంటిని చూస్తే ఎవరూ కూడా అది ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి ఇల్లు అని అనుకోరు అలా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది.
బాత్రూమ్ నుంచి మొదలుకొని ఇల్లు మొత్తం ఎంతో ఖరీదైన వస్తువులను ఉపయోగించడమే కాకుండా బాత్రూంలో టాయిలెట్ లో కూడా బంగారంతో చేసినవి కావడం విశేషం.ఈ క్రమంలోనే అక్రమ రవాణా జరుగుతున్న తనిఖీలు చేయకుండా డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వీరి ఇంటిని సోదా చేశారు. ఈ విధంగా అలెక్సీ ఇంటిని చూసిన అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న అలెక్సీతో పాటు మరో ఆరుగురి పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…