గర్భం దాల్చిన మహిళలను పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగమని పెద్దలు చెబుతుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గర్భిణీలు అందుకనే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒకటి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్కలను కలిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును కలుపుకుని తాగడం వల్ల పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారని ఒక నమ్మకం ఉంది. మరి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంకుమ పువ్వులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల పాలలో కుంకుమ పువ్వును కలుపుకుని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ మాట వాస్తవమే. గర్భిణీలు 9వ నెలలో కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగితే కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో సుఖ ప్రసవం జరుగుతుంది.
కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే ఈ సమస్యలు వస్తాయి కనుక అలా తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
కుంకుమ పువ్వులో యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. గర్భిణీలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అయితే కుంకుమ పువ్వును అధిక మోతాదులో తీసుకుంటే హాని కలుగుతుంది. కనుక రోజుకు 1 లేదా 2 రెక్కల్ని మించకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల పుట్టబోయే పిల్లలతోపాటు తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారన్న మాట నిజం. సైన్స్ దీన్ని ధ్రువీకరించింది. కానీ పిల్లలు అందంగా పుడతారని ఎక్కడా నిరూపణ కాలేదు. అందువల్ల పిల్లల ఆరోగ్యం కోసం కుంకుమ పువ్వును అలా పాలలో కలిపి తీసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…