దొరుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పటివరకు ఈ విధమైనటువంటి వింత చేపలు ఎందరినో ఆశ్చర్యపరచాయి. తాజాగా ఇలాంటి అరుదైన వింతైన చేప ఒకటి అమెరికాలోని నార్త్ కెరొలినాలో ఓ జాలరికి దొరికింది. ఈ చేప అచ్చం మనిషి పళ్ళను పోలిన పళ్ళను కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ విధంగా మనిషి పళ్ళను పోలి ఉన్న చేపలను ‘షీఫ్స్ హెడ్’ గా వ్యవహరిస్తారు.ఈ అరుదైన చేపలు ఎక్కువగా రాళ్ల ప్రాంతాలలోను, బ్రిడ్జిల సమీపంలో ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. ఈ చేప పై తెలుపు, నలుపు చారలు ఉన్న కారణంగా ఈ చేపను కాన్విక్ట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి చేపలను ఓమ్నీవారస్ జాతికి చెందినవి.ఈ జాతికి చెందిన చేపలకు పళ్ళు అచ్చం మనిషి పళ్ళు మాదిరిగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి అరుదైన చేపలు నార్త్ కెరొలినా లోని కోస్తా జలాల్లో ఏడాది పొడవునా కనిపించినప్పటికీ జాలర్ల చేతికి చిక్కడం చాలా అరుదని తెలిపారు. ఈ చేపలు పళ్ళ సహాయంతో కేరళ పై ఉండే పెంకు పగలగొట్టు కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ దంతాలు ఎంతో దృఢంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో అరుదైన జాతికి చెందిన ఈ చేపలను తినవచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.ప్రస్తుతం ఈ అరుదైన చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు.