ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా అంటేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. మన చుట్టుపక్కల ఎవరికైనా కరోనా సోకింది అనే వార్త తెలియగానే వారిని ఎంతో చిన్నచూపుతో చూస్తున్న రోజులివి. అలాంటిది తనకు కాబోయే భర్తకు కరోనా సోకిందనే వార్త తెలియగానే ఆ వధువు ఏమాత్రం భయపడకుండా ముందడుగు వేసింది.
కేరళలోని కైనంకరి ప్రాంతానికి చెందిన శరత్, అభిరామికి వివాహం కుదిరింది. ఈ నెల 25న వీరి వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. అయితే వీరి పెళ్లికి కరోనా అడ్డుపడింది. వరుడు అతని తల్లి కరోనా బారిన పడటంతో అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వదువు అభిరామి మాత్రం అనుకున్న తేదీ తన పెళ్లి జరగాలని నిర్ణయించుకుంది. దీని కోసం రెండు కుటుంబాల సభ్యులను ఒప్పించింది.
ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యులు కలెక్టర్ ను కలిసి జరిగిన విషయం చెప్పి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నారు. కలెక్టర్ అనుమతి ఇవ్వడంతో ఆస్పత్రిలోని కోవిడ్ వార్డు కాస్తా.. కళ్యాణ మంటపంగా మారిపోయింది. ఇరు కుటుంబాలు నిశ్చయించిన తేదీ సమయానికి పీపీఈ కిట్‌లో వచ్చిన అభిరామి, శరత్ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ జంటకు కరోన వార్డులో చికిత్స తీసుకుంటున్న తన అత్తగారు దగ్గరుండి దండలు అందించి వీరి పెళ్లి జరిపించడం విశేషం. ఈ విధంగా కరోనా వార్డులో ఒకటైన ఈ జంటకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…