పట్టణాలు, నగరాల్లో అయితే పబ్లిగ్గా ముద్దులు పెట్టుకున్నా ఎవరూ ఏమీ అనరు, ప్రశ్నించరు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇలా చేస్తే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరిగ్గా ఆ జంటకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్‌లోని గయ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఓ జంట రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై ప్రయాణిస్తోంది. భర్త వెనుక భార్య కూర్చుని వాహనంపై వెళితే ఇబ్బంది రాకపోయేది. కానీ భర్త ముందు ట్యాంకు మీద భార్య కూర్చుంది. ఆమె అతనికి ముద్దు పెట్టినట్లు ఎదురుగా కూర్చోవడంతో వారు స్థానికుల దృష్టిని ఆకర్షించారు. దీంతో కొందరు వారిని వీడియో తీశారు.
https://youtu.be/V-PHVLed5yU
అయితే ఆ విషయాన్ని గమనించిన ఆ దంపతులు తమను వీడియో ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. అందుకు ఆ గ్రామస్థులు వారితో గొడవపడ్డారు. బైక్‌పై సరిగ్గా కూర్చుని ప్రయాణించకుండా అలా అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఆ గ్రామవాసులు వారితో గొడవ పడ్డారు. చివరకు గొడవ పెద్దది కావడంతో తమ పరువు పోతుందని భావించిన ఆ దంపతులు ఆ గ్రామ వాసులకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అంతా సద్దుమణిగింది. అయితే వారు అలా బైక్‌పై వెళ్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.