మన దేశంలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికితే అరెస్టు చేస్తారనే భయంతో విదేశాలకు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అతనే. అతను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా కరోనా నేపథ్యంలో నిత్యానందుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందని ఓ శిష్యుడు ఆ నిత్యానందుడిని అడిగాడట. దీంతో నిత్యానందుడు బదులిస్తూ తాను భారత్‌లో అడుగుపెడితో కరోనా మాయమవుతుందని చెప్పాడట. దీంతో మరోసారి నిత్యానందుడు వార్తల్లో నిలిచాడు.
అన్నట్లు గుర్తుంది కదా.. నిత్యానందుడు ఇప్పటికే క్విటోలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టాడు. తన దేశానికి ఓ పాస్‌పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. తమ దేశ పౌరసత్వం కావాలంటే విరాళాలు అందించాలని కోరుతున్నాడు. అయితే నిత్యానందుడు పైన తెలిపిన విధంగా అనడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు అతనిపై రక రకాల కామెంట్లు చేస్తున్నారు.