గత సంవత్సర కాలం నుంచి కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకకుండా మనమే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇక కరోనా టెస్ట్‌లు చేసే సమయంలో ఇంకెంత జాగ్రత్తపడాలి.
తాజాగా స్వాబ్ టెస్ట్‌ల కోసం వాడే పుల్లలను అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో స్లాబ్ టెస్ట్ కోసం పుల్లలను ప్యాక్ చేస్తున్న వారెవరు సామాజిక దూరం పాటించలేదు, శానిటైజర్ లు వాడటం లేదు, చేతికి గ్లౌజులు వేసుకోలేదు, మాస్కులు ధరించడం లేదు. ఒక ఇంట్లో అపరిశుభ్రమైన వాతావరణంలో వీటిని ప్యాక్ చేయడం చూస్తే ఇకపై ఎవరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
So for a virus that so transmissible we have to wear masks and social distance but to find it you have to stick a swab to your brain membrane to find it. Wake up people. pic.twitter.com/BgSJrAwPw9
— cahago (@cahago1) May 6, 2021
ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో తయారు కావలసిన ఈ టెస్ట్ కిట్లు ఈ విధంగా అపరిశుభ్ర వాతావరణం పై తయారు చేస్తుండటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ కాక మరేం వస్తుందంటూ, ఇలాంటి వారికి స్వాబ్ టెస్ట్ స్టిక్స్ తయారీ బాధ్యతను అప్పగించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియక పోయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.