కరోనా వైరస్ ముందుగా ఎక్కడ ఉద్భవించింది.. అని అడిగితే అందుకు ఎవరైనా సరే.. చైనా అనే సమాధానం చెబుతారు. ఈ విషయం ఒకటవ తరగతి చదివే పిల్లలకు కూడా తెలుస్తుంది. అయితే అంతటి భారీ స్థాయిలో అక్కడ కేసులు వచ్చినా ఉన్నట్లుండి సడెన్ గా కేసులు ఎందుకు సున్నా అయ్యాయి ? అసలు కోవిడ్ ను చైనా ఎలా కట్టడి చేయగలిగింది ? వంటి ప్రశ్నలన్నీ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.
ఇక తాజాగా మరోమారు చైనాలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర దేశాల్లాగే అక్కడ కూడా డెల్టా వేరియెంట్ పంజా విసురుతోంది. అయితే కరోనా ఉన్నప్పటికీ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి యథేచ్చగా తిరుగుతున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. దీంతో చైనాతోపాటు తైవాన్‌లోనూ అనేక ప్రాంతాల్లో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు.
The Chinese Communist Party is locking people inside their homes again.
If someone in the building tests positive or has positive contact tracing, the whole building gets sealed for 14 to 21 days, sometimes longer.
August 2021 pic.twitter.com/LyArs7DQN6
— Things China Doesn't Want You To Know (@TruthAbtChina) August 8, 2021
https://twitter.com/malau94428928/status/1424721650101022723
కోవిడ్ వచ్చిన వారిని చైనా, తైవాన్ లలో ఇళ్లలోనే బంధిస్తున్నారు. సిబ్బంది పీపీఈ కిట్లను ధరించి వచ్చి కోవిడ్ బాధితుల ఇళ్లను మూసేస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం తెరవకుండా బయట మేకులు కొడుతున్నారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.