Viral Video : బిడ్డలు ఎంత క్రూరులైనా సరే తల్లి తన ప్రేమను చూపిస్తుంది. అందుకనే తల్లి ప్రేమకు వెలకట్టలేరు అంటారు. తన బిడ్డలకు చిన్న గాయం అయినా తల్లి తట్టుకోలేదు. ఆ నొప్పిని తన నొప్పిగా భావించి విలవిలాడిపోతుంది. తన బిడ్డకు గాయం నయం అయ్యే వరకు సపర్యలు చేస్తుంది. దగ్గు వచ్చినా, జ్వరం బాధిస్తున్నా.. దుఃఖం వస్తున్నా.. బిడ్డలను తల్లి ఓదార్చి అక్కున చేర్చుకుంటుంది. భగవంతుడు అన్ని చోట్లా ఉంటాడు. కానీ తల్లి ప్రేమను ఇవ్వలేడు కదా. కనుకనే ఆయన అమ్మను సృష్టించి మనకు ఇచ్చాడని చెబుతారు.
ప్రపంచంలో అత్యంత నమ్మకం అయిన వ్యక్తి ఎవరు.. అని అడిగితే మన నోటికి ఠక్కున గుర్తుకు వచ్చే వారు.. అమ్మనే. అమ్మను మించిన దైవం లేదని కూడా చెబుతారు. నవమాసాలు మోసి కని పెంచే తల్లి.. తన పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చుకుని తమకు, తమ ఊరికి, తమ దేశానికి పేరు తేవాలని కోరుకుంటుంది. తల్లులు దైవంతో సమానం అని పూర్వ మునులు కూడా చెప్పారు. మాతృమూర్తికి వందనం చేయడం అంటే దైవానికి వందనం చేసినట్లే అని అంటుంటారు.

అయితే అలాంటి ఎంతో గొప్ప వ్యక్తి అయిన తల్లిని కోల్పోయిన ఆ బాలుడి బాధ వర్ణనాతీతం అనే చెప్పవచ్చు. ఓ బాలుడు తన తల్లి సమాధి దగ్గర కూర్చుని తన తల్లిని రమ్మని అమ్మా.. అమ్మా.. అని పిలుస్తున్న వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఆ బాలుడి వేదన చూస్తుంటే అందరికీ కన్నీరు వస్తోంది. అంతటి హృదయ విదారకంగా ఆ వీడియో ఉంది. దాన్ని చూసిన నెటిజన్లు సైతం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని లక్షల మంది చూశారు. అందరూ ఆ బాలుడి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram