ప్రస్తుత కాలంలో అటవీ ప్రాంతాలు పూర్తిగా అంతరించడంతో అడవిలో నివసించే జంతువులు ఆహారం కోసం గ్రామాలలో సంచరించడం మనం చూస్తున్నాము. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన చిరుత ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసింది ఈ క్రమంలోనే వారు వారి చేతిలో ఉన్నటువంటి బర్త్ డే కేక్ చిరుత పై విసిరి ప్రాణాలను కాపాడుకున్నారు.
ఫిరోజ్, సబీర్ అన్నదమ్ములలో ఫిరోజ్ కుమారుడి పుట్టినరోజు ఉండడంతో వీరిద్దరూ కలిసి ద్విచక్రవాహనం పై బుర్హాపూర్‌లో కేక్ తీసుకొని తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఓ చెరుకు తోట నుంచి చిరుత పులి బయటకు వచ్చే వారిపై దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే చిరుత సుమారు 500 మీటర్ల వరకు వారిని వెంబడించింది.
చిరుత దాడి నుంచి తప్పించుకోవడం కోసం తమ్ముడు సబీర్ తన చేతిలో ఉన్న బర్తడే కేకును చిరుత మొహంపై విసిరాడు. దీంతో చిరుత అక్కడే ఆగిపోవడంతో బతుకుజీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడి నుంచి ఎంతో వేగంగా తమ గ్రామానికి చేరుకున్నారు. ఈ విధంగా ఈ అన్నదమ్ములు ఇద్దరి ప్రాణాలను కేవలం బర్త్డే కేక్ కాపాడిందని చెప్పవచ్చు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.