సాధారణంగా మనం పామును చూడగానే భయంతో ఆమడదూరం పరిగెత్తాము.కొంత సమయం వరకు తిరిగి ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటే వెనకడుగు వేస్తాము. అయితే పాములలో ఎంతో విషపూరితమైన పాములు కూడా ఉంటాయి.అవి మనపై దాడిచేసి కాటువేస్తే కొన్ని సార్లు మన ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లవచ్చు కనుక పాములకు వీలైనంతవరకు దూరంగానే ఉంటాము.అయితే కొన్ని సార్లు పాములు పెద్ద పెద్ద కొండచిలువలు ఆహారం లేదా ఆవాసం కోసం ఇంటి లోనికి రావడం మనం చూస్తుంటాము. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలోని గ్రాజ్‌లో 65 ఏళ్ల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు నిద్రలేచాడు. ప్రతిరోజు మాదిరిగా తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ వృద్ధుడు బాత్ రూం లోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడికి సోమవారం తన బాత్రూంలో ఒక షాకింగ్ ఘటన ఎదురయింది.ఈ విధంగా బాత్రూమ్ వెళ్లిన ఆ వృద్ధుడికి కాలకృత్యాలు తీర్చుకుని ఉండగా కాలకృత్యాలు చేసేచోట కొండచిలువ కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన ఈ యువకుడు ఏంటి అని పరిశీలించగా టాయిలెట్ బేసిన్ కింద ఐదు అడుగుల కొండచిలువ ఉండటం చూసి భయంతో పరుగులు పెట్టాడు.
ఈ క్రమంలోనే జరిగిన విషయం మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. అయితే ఆ వృద్ధుడు ఇంటి పక్కన ఉండే ఒక 24 ఏళ్ల కుర్రాడు వివిధ రకాల పాములను పెంచుతున్నాడనే విషయం బయటపడింది.ఈ క్రమంలోనే అతడిని విచారించగా తన దగ్గర ఉన్నటువంటి ఒక కొండచిలువ మాయమైందని అసలు విషయం తెలియజేశాడు. అయితే ఆ వృద్ధుడిని కాటు వేసిన తర్వాత కొండచిలువ పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లి పోయింది. ఈ క్రమంలోనే పోలీసులు పాములు పట్టే వారిని పిలిచి ఆ యువకుడు దగ్గర ఉన్నటువంటి పాములను అటవీ ప్రాంతంలోకి తరలించారు. కానీ ఆ కొండచిలువ కాటు వేయడంతో వృద్ధుడికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.