సాధారణంగా ప్రతి మనిషికి 32 దంతాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.కానీ బీహార్ కి చెందిన ఓ కుర్రాడికి మాత్రం నోరంతా దంతాలు కలిగి ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఈ కుర్రాడికి 32 దంతాలకు బదులుగా ఏకంగా 82 దంతాలు ఉండడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.బీహార్‌లోని పాట్నాలో నివసిస్తున్న 17 ఏళ్ల టీనేజర్ నితీష్ కుమార్ ఒక అరుదైన సమస్యతో బాధ పడటం వల్లే దంతాలు అధికంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ విధంగా దంతాలు ఎక్కువగా రావటాన్ని వైద్యపరిభాషలో ‘ఓడోంటోమా’ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా నోటి నిండా పళ్ళు ఉండటంతో ఆ కుర్రాడికి మాట్లాడటానికి నోరు మెదప డానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అదేవిధంగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విధంగా నితీష్ కుమార్ కి పుట్టుకతో ఇన్ని పళ్ళు రాలేదని, గత ఐదు సంవత్సరాల నుంచి నోటిలో కణతులు ఏర్పడి వాటి నుంచి దంతాలు వచ్చాయని తెలిపారు.అయితే ఆర్థిక ఇబ్బందులు వల్ల ఇన్ని రోజులు చికిత్స చేయించుకోలేదని ప్రస్తుతం నొప్పి అధికమవడంతో నితీష్ ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్యులను సంప్రదించాడు. ఇతని సమస్య చూసిన వైద్యులు సైతం ఎంతో ఆశ్చర్యానికి గురి అయినట్లు తెలిపారు.ఈ క్రమంలోనే వైద్యులు అతనికి సుమారు మూడు గంటల పాటు చికిత్స చేసి దంతాలను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇతడి నోటిలో ఏర్పడిన దంతాలకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రాలను ఈ కింద చూడగలరు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…