ఏడాది వయస్సులో పిల్లలు ఎంత బరువు ఎత్తుతారు ? చిన్న చిన్న వస్తువులను వారు మోయగలరు. కానీ ఆ బాలుడు మాత్రం అలా కాదు. ఏకంగా 6 కిలోల బరువు ఎత్తాడు. ఆ వయస్సులో సహజంగా పిల్లలు ఆట వస్తువులతో ఆడుకుంటారు. కానీ బరువులు ఎత్తే ప్రయ్నతం చేయరు. అయితే ఆ బుడతడు మాత్రం అంత భారీ మొత్తంలో బరువును ఏకంగా రెండు సార్లు ఎత్తాడు.
ఈ వీడియో ఎక్కడితో తెలియదు కానీ మొదటగా దీన్ని రెడ్డిగ్ అనే సోషల్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. తరువాత ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఆ వీడియోను ఇతర సోషల్ మాధ్యమాల్లో కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో లక్షల మంది ఈ వీడియోను చూశారు.
He was determined to pick up this 15lbs medicine ball and so he did!
byu/FearmyBeard21 innextfuckinglevel
అందులో ఓ బాలుడు నల్లగా, గుండ్రగా ఉన్న ఓ బంతి సైజు వస్తువును రెండు సార్లు ఎత్తాడు. దాని బరువు 6 కిలోలు. కాగా ఆ బాలుడు అలా బరువు ఎత్తడాన్ని చూసి అందరూ షాకవుతున్నారు. అతను భవిష్యత్తులో ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం ఖాయమని అంటున్నారు.