Weekly Numerology : మనలో చాలా మంది జోతిష్య శాస్త్రాన్ని, వాస్తు శాస్తాన్ని నమ్మినట్టే న్యూమరాలజీని కూడా విశ్వసిస్తారు. న్యూమారాలజీలో, పుట్టిన తేది మరియు రాడిక్స్ సంఖ్య ఆధారంగా భవిష్యత్తును చెబుతారు. ఏప్రిల్ నెల ప్రారంభమైంది. కనుక ఏప్రిల్ మొదటి వారం రాడిక్స్ సంఖ్య 1 నుండి 9 గల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సంఖ్య 1 :- కెరీర్ పరంగా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. జీవితంలో పురోగతిని సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ మీద అసూయ ఉన్న వారికి దూరంగా ఉండడం మంచిది.
సంఖ్య 2 :- సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రజలకు మేలు చేసే పనులను చేస్తారు. మానసిక ఒడిదుడుకలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అలాగే సవాలును ఎదుర్కోవడంలో విజయం సాధిస్తారు.
సంఖ్య 3 :- ఈ వారం మీ జీవితంలో సానుకూలత పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉండడంతో పాటు కొత్త అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. బంధువుల నుండి ఆనందం పొందుతారు.

సంఖ్య 4 :- ఈ వారం మీరు సామాజిక సంబంధాలను ఏర్పరుచుకుంటారు మరియు ప్రజల దృష్టికి వస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
సంఖ్య 5 :- తగాదాల నుండి బయటపడడం మంచిది. వ్యకిగత సంబంధాలలో వచ్చే వివాదాలు మంచివి కావు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంతో సానుకూలంగా ఉండడం మంచిది.
సంఖ్య 6 :- ఈ వారం మీరు ఆశ మరియు భయం మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడం మంచిది. కెరీర్ పరంగా విజయ పథంలో ఉన్నారు. ముందు చేసిన తప్పుల నుండి మంచి నేర్చుకుని ముందుకు సాగడం మంచిది.
సంఖ్య 7 :- మీకు ఉండే ఉదారమైన మనసు మరియు దయ ఇతరుల జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీకు లాభాలను అందిస్తుంది. అలాగే మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి రావచ్చు.
సంఖ్య 8 :- ఈ వారం మీ జీవితంలో కొత్త మార్పులు, కొత్త మలుపులు వస్తాయి. ఈ కొత్త మార్పులు మీ దృక్పథాన్నే మార్చేస్తాయి. ఈ మార్పుల వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది.
సంఖ్య 9 :- మీకు ఉన్న బాధ్యతలు మీరు మరింత పని చేసేలా చేస్తాయి. మీ యొక్క సంభాషణ శైలి ఇతరులను ప్రభావితం చేస్తుంది. అలాగే మీ నమ్మకం మీ సామర్థ్యం మీ కలలను నెరవేరుస్తాయి.