మార్కెట్‌లో మనకు అనేక రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ ఇష్టాలు, అభిరుచులు, స్థోమతకు అనుగుణంగా దుస్తులను కొని లేదా కుట్టించి ధరిస్తుంటారు. అయితే దుస్తులను ధరించే విషయంలోనూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజు నిర్దిష్టమైన రంగులు కలిగిన దుస్తులను ధరించాల్సి ఉంటుంది. దీంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏయే రంగు దుస్తులను ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం రోజు తెలుపు, నీలిరంగు, నలుపు, బ్రౌన్ కలర్ తప్ప మిగిలిన ఏ రంగు దుస్తులను అయినా సరే ధరించవచ్చు. సోమవారం మిల్కీ వైట్, బూడిద రంగు, నారింజ, ఆకుపచ్చ, చిలకపచ్చ రంగు దుస్తులను ధరిస్తే మంచిది. సోమవారం బ్రౌన్ కలర్ దుస్తులను ఎట్టి పరిస్థితిలోనూ ధరించరాదు. మంగళవారం ఎరుపు, వంకాయ, ఆరెంజ్, పసుపు, మిల్కీ వైట్, గ్రే, గులాబీ రంగు దుస్తులను ధరించాలి. అదే రోజు ఆకుపచ్చ, చిలకపచ్చ, బ్రౌన్ కలర్ దుస్తులను ధరించరాదు.
బుధవారం ఆకుపచ్చ, చిలకపచ్చ, ఆరెంజ్, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. మిల్కీ వైట్ దుస్తులను ధరించరాదు. గురువారం పసుపు, ఆరెంజ్, మిల్కీ వైట్, ఎరుపు, మెరూన్, వంకాయ, గ్రే కలర్, గులాబీ కలర్ దుస్తులను ధరించాలి. అదే రోజు ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులను ధరించరాదు. శుక్రవారం రోజు తెలుపు, ఆకుపచ్చ, చిలకపచ్చ, బ్రౌన్ కలర్, నీలి రంగు, నలుపు, గులాబీ రంగు దుస్తులను ధరించాలి. అదే రోజు ఆరెంజ్, మిల్కీ వైట్, గ్రే కలర్ దుస్తులను ధరించరాదు. శనివారం రోజు నీలి రంగు, నలుపు, తెలుపు, ఆకుపచ్చ, చిలకపచ్చ, బ్రౌన్ కలర్ దుస్తులను ధరించాలి. అదే రోజు ఆరెంజ్, మిల్కివైట్, గ్రే కలర్, మెరూన్ కలర్, ఎరుపు రంగు, గులాబి రంగు దుస్తులను ధరించరాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…