Water In Bucket : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరు కూడా, అదృష్టం కలగాలని, విజయాన్ని అందుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే, అదృష్టం కలగాలంటే ఇలా చేస్తే మంచిదని పండితులు చెప్పడం జరిగింది. అదృష్టం కలగాలంటే, స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకోవాలని పండితులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, అదృష్టాన్ని పొందడానికి అనేక రకాలుగా చూస్తూ ఉంటారు. విజయాన్ని అందుకోవాలని, డబ్బులు కలగాలని, కీర్తి ప్రతిష్టలు పెరగాలని ఇలా భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆరోగ్యం, సంపద, సంబంధాలు ఇలా అనేక వాటిని మనం మెరుగుపరచుకోవడానికి, పలు పద్ధతుల్ని పాటిస్తూ ఉంటాము. అదృష్టాన్ని పొందడానికి ఇలా చేయండి. పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. స్నానం చేసే నీటిలో, పసుపు వేస్తే అదృష్టం కలుగుతుంది. పసుపులో క్రిమినాసిక గుణాలు ఉంటాయి. పసుపు వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అదృష్టం కలుగుతుంది. అలానే, మనం స్నానం చేసే నీళ్లలో గంధాన్ని వేసుకుంటే కూడా అదృష్టం కలుగుతుంది.

గంధం ప్రశాంతత ని ఇస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. ఒత్తిడి ని దూరం చేస్తుంది. స్నానం చేసే నీళ్లల్లో వేప ఆకులు వేసుకుంటే కూడా మంచిది. వేప ఆకులని స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుంటే, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఔషధ గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి. తులసి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తులసిని మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుంటే, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. తులసి ఆకుల్ని కానీ తులసి నూనెను కానీ వేసుకోవచ్చు. అలానే, అదృష్టం కలగాలంటే గులాబీ రేకులు కూడా మనకి సహాయం చేస్తాయి. గులాబీ రేకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణ కి కూడా గులాబీ రేకులు బాగా ఉపయోగపడతాయి. గులాబీ రేకులు ని స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే ప్రశాంతతను పొందొచ్చు.