Vishnu Rekha : మన అరచేతి యొక్క గీతలు, గుర్తులు, నిర్మాణాలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు అతని భవిష్యత్తునుగురించి చాలా చెబుతాయి. హస్తసాముద్రికంలో ఈ రేఖలు, గుర్తుల గురించి తెలుసుకునే పద్దతుల గురించి చక్కగా వివరించబడ్డాయి. దీంతో పాటు అవి కలిగించే శుభ, అశుభ ఫలితాల గురించి కూడా అనేకం వివరించారు. అలాగే ఈ రోజు మనం అదృష్టవంతుల చేతుల్లో ఉండే ఒక రేఖ గురించి అలాగే అది కలిగించే శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ రేఖయే విష్ణు రేఖ. చేతిలో ఈ రేఖ ఉన్న వారు ధనవంతులు అవుతారు. ఆనందాన్ని, ఉన్నత పదవులను, గౌరవాన్ని పొందుతారు. మన అరచేతిలో హృదయ రేఖ నుండి ఒక రేఖ ఉద్భవించి బృహస్పతి పర్వతాన్ని చేరుకుంటే దానిని విష్ణు రేఖ అంటారు.
ఈ రేఖ హృదయ రేఖను రుండు భాగాలుగా చీల్చినట్టు కనిపిస్తుంది. చేతిపై విష్ణురేఖ ఉన్నవారికి ప్రత్యేక ఆశ్వీరాదం ఉంటుంది. అలాగే ఈ రేఖ కలిగిన వారికి గురుగ్రహం కూడా చాలా బలంగా ఉంటుంది. బృహస్పతి సంపద, సౌభాగ్యం, సంతోషం, పిల్లలు,జ్ఞానం, గౌరవానికి కారకుడు. అందుచేత విష్ణురేఖ ఉన్న వారు చాలా అదృష్టవంతులు. వీరు కష్టాలను కూడా చాలా తక్కువగా ఎదుర్కొంటారు. విష్ణురేఖ ఉన్నవారు శ్రీ మహావిష్ణువు కృపతో ఆనందాలను సులభంగా పొందుతారు. అలాగే విష్ణురేఖ ఉన్నవారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వీరు వీరి జ్ఞానం ఆధారంగా గౌరవం పొందుతారు. అలాగే వారు చాలా మంచి జీవిత భాగస్వామిని పొందుతారు.
వీరి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే విష్ణురేఖ ఈ వ్యక్తులకు అపారమైన సంపదతో పాటు ఉన్నతస్థానం మరియు ప్రతిష్టను ఇస్తుంది. ఈ రేఖ ఉన్న వారు ఏ రంగంలోకి వెళ్లిన కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ముఖ్యంగా విద్య, ఆధ్యాత్మిక రంగాల్లో గౌరవం ఎక్కువగా లభిస్తుంది. విష్ణురేఖ ఉన్నవారు నిరుపేద కుటుంబంలో పుట్టిన ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొని ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…