Chanakya Niti : ఆచార్య చాణక్యుడు గొప్ప జ్ఞానవంతుడు మరియు పండితుడు. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క గురువు. అతను చాణక్య నీతి అని పిలవబడే నీతి శాస్త్రాన్ని రచించాడు. నేటికి ప్రజలు తమ జీవితాల్లో ఈ విధానాన్ని అవలంబిస్తారు. చాణక్యుడు ఇచ్చిన విధివిధానాలు ఒక మనిషిని వ్యక్తిగతంగా, సామాజికంగా, రాజకీయంగా నడిపిస్తాయి. అలాగే చాణక్యుడు అతని నీతి శాస్త్రంలో మనం ఎల్లప్పుడూ దూరంగా ఉండాల్సిన 5 అలవాట్ల గురించి కూడా చెప్పాడు. వీటికి దూరంగా ఉండకపోతే మనం జీవితంలో వైఫల్యాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అతను చెప్పాడు. చాణక్యుడి నీతిశాస్త్రం ప్రకారం మనం దూరంగా ఉండాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు.
దీని వల్ల ప్రజలు వారు చేసే తప్పులను మరిచిపోయి ఇతరుల తప్పులపై దృష్టి ఎక్కువగా పెడతారు. మీ చుట్టూ అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే మనం ఎప్పుడూ కూడా శుభ్రమైన వాతావరణంలో ఉండాలి. మన చుట్టూ మురికిగా ఉంటే మన దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అంతేకాకుండా అపరిశుభ్రమైన చోట లక్ష్మీ దేవి ఉండదు. కనుక ఎప్పుడూ స్వచ్చతను, పరిశుభ్రతను పాటించాలి. మన చుట్టూ ఎవరైనా మురికిగా ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే మనం ఎప్పుడూ కూడా నిజాలే మాట్లాడాలి. అబద్దాలు చెప్పకూడదు. అబద్దాలు చెప్పే వారు ఎల్లప్పుడూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అబద్దాలు చెప్పడం వల్ల మనం గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది.
అలాగే మనం ఎప్పుడూ కూడా చురుకుగా పని చేసుకోవాలి. బద్దకంగా అస్సలు ఉండకూడదు. బద్దకంగా ఉండడం వల్ల మనం భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చాణక్య నీతి ఎప్పుడూ కూడా అత్యాశ మంచిది కాదు అని చెబుతుంది. అత్యాశ, దురాశ రెండు కూడా మంచివి కావు. వీటి వల్ల మనం కష్టాలను, అగౌరవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా చాణక్యనీతి మనకు ఈ 5 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతుంది. వీటికి దూరంగా ఉండడం వల్ల మనకు మంచి జరగడంతో పాటు గౌరవాన్ని కూడా పొందగలుగుతాము.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…