Vastu Tips : మనం మన ఇంట్లో పెట్టుకునే వస్తువుల వల్ల కూడా మన ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పెట్టుకునేందుకు పనికిరావు. అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటే దోషం ఏర్పడుతుంది. దీంతో ఆ ఇంట్లోని వారికి అన్నీ సమస్యలే వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు వస్తుంటాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మాత్రం ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపవచ్చు. దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
చాలా మంది లాఫింగ్ బుద్ధ విగ్రహాలను ఇల్లు లేదా ఆఫీసు, షాపుల్లో పెట్టుకుంటారు. అయితే దీన్ని కేవలం గిఫ్ట్ గా మాత్రమే పొందాలని, సొంతంగా కొని ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతారు. కానీ ఇది వట్టి అపోహ మాత్రమే. లాఫింగ్ బుద్ధ విగ్రహాలను మనమే స్వయంగా కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టాలి. ఆ దిశలో హాల్ ఉంటే అందులో ఎక్కడైనా ఈ విగ్రహాన్ని పెట్టవచ్చు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించబడుతుంది. దీంతో సంపద లభిస్తుంది. ఇంట్లోని వారందరూ సంతోషంగా ఉంటారు. ఎలాంటి కుటుంబల కలహాలు, ఇతర సమస్యలు కూడా ఉండవు.
ఇక ఉత్తర ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల్లో కొందరు ఈవిల్ ఐ అని పిలవబడే ప్రత్యేకమైన లాకెట్లు లేదా పెండెంట్లు, చిన్నపాటి విగ్రహాలను ఇళ్లలో పెట్టుకుంటుంటారు. వీటిని ఇంట్లో పెట్టుకుంటే మనపై ఉండే దిష్టి పోతుంది. మన ఇంట్లోని వారిపై ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. దీంతో ఇంట్లోని వారికి లక్ కలసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏం చేసినా విజయం సాధిస్తారు.
అలాగే చైనీయులు ఇంట్లో లక్ మరియు అదృష్టం కోసం ఎరుపు రంగు ఎన్వలప్‌లను పెట్టుకుంటుంటారు. ఇవి అదృష్టాన్ని తెచ్చి పెడతాయని వారు విశ్వసిస్తారు. అలాగే ఏ పనిచేసినా విజయం సాధిస్తారని నమ్ముతారు. దీంతోపాటు ఎరుపు రంగు ఎన్వలప్‌లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వారు నమ్ముతారు. అలాగే మనీ ప్లాంట్ లేదా బాంబూ ప్లాంట్ మొక్కలను కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. నెగెటివ్ ఎనర్జీని పోగొడుతాయి. మనల్ని సమస్యల నుంచి బయట పడేస్తాయి. డబ్బు వచ్చేలా చేస్తాయి. కనుక వీటిని ఇంట్లో పెట్టుకోవడం మంచిది. దీంతో అన్ని రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…