Tortoise Ring : చాలా మంది వేళ్ళకి ఉంగరాలని పెట్టుకుంటుంటారు. కొంతమంది జాతకం చూపించుకుని, జాతకంలో ఉండే వాటికి పరిహారం కింద ఉంగరాలని పెట్టుకుంటారు. అప్పుడు అదృష్టం వస్తుందని భావిస్తారు. ఎక్కువ మంది దేవుడు బొమ్మలు ఉన్న ఉంగరాలని ధరిస్తారు. చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు, తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఈ తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు.
తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు. తాబేలు ఉంగరాన్ని మనం ఇష్టానుసారంగా పెట్టుకోకూడదు. వాటిని పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు కచ్చితంగా ఉంటాయి. మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన వ్యక్తి యొక్క జీవితంలో, చక్కటి మార్పులు చోటు చేసుకుంటాయి. తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు మధ్య వేలుకి కానీ చూపుడు వెలుగు కానీ పెట్టుకోవాలి.
పైగా ఎప్పుడూ కుడి చేతికి మాత్రమే పెట్టుకోవాలి. తాబేలు ముఖం మనకి ఎదురుగా ఉండాలి. వ్యతిరేక దిశలో ఉండకూడదు. శుక్రవారం సంపదకి దేవత అయిన లక్ష్మీదేవికి పవిత్రమైన రోజు. ఈ రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి. పంచదాతు, అష్టధాతు, వెండి తాబేలు ఉంగరం పెట్టుకుంటే మంచిది.
ఉంగరాన్ని పెట్టుకునే ముందు, ఉంగరాన్ని పచ్చి పాలల్లో నానబెట్టాలి. తర్వాత లక్ష్మీదేవి చిత్రానికి కానీ విగ్రహానికి కానీ పూజ చేసి, తర్వాత ఉంగరాన్ని పెట్టుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. పదేపదే ఉంగరాన్ని వేళ్ళ నుంచి తీయకూడదు. ఇలా తాబేలు ఉంగరాన్ని మీరు పెట్టుకుంటే సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారంలో కూడా నష్టపోకుండా ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…