Karma Phalalu : ఒక రాజు ఉండేవారు. ఆ రాజు శివ భక్తుడు. శివుడి మీద ఉన్న భక్తితో కోటలో శివాలయాన్ని కట్టించాడు. పైగా బ్రాహ్మణుడిని పెట్టి రోజూ పూజలు జరిపించేవాడు. ఆ బ్రాహ్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో రోజూ పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడి భక్తికి మెచ్చి రాజు విలువైన కానుకలని పిలిచి ఇచ్చారు. కానీ వాటిని స్వీకరించకుండా తిరస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు కేవలం అతనికి ఉన్న దానితోనే తృప్తి పడేవాడు. కాలం గడిచింది. ఒకరోజు మహారాజుకి కొడుకు పుట్టాడు. ఆ మహారాజు తన కొడుకుకి విద్యలన్నీ నేర్పించాడు.
ఆ తర్వాత యవ్వన వయసు వచ్చాక, అందమైన స్త్రీ తో పెళ్లి చేశారు. పెళ్లయింది. ఒక రోజు రాజకుమారికి నిద్ర రాలేదు. యువరాజు చూస్తే నిద్రపోతున్నాడు. నిద్ర రాక ఆమె ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటే.. ఒక రత్నాల కత్తి కనపడింది. రత్నాలతో ఉండడం వలన కత్తి ఒక్కసారే మెరిసింది. భయపడి యువరాణి ఆ కత్తిని విసిరేసింది. నేరుగా కత్తి యువరాజు కంఠం దగ్గర పడేసరికి మెడ తెగిపోయింది. ఇలా యువరాజు చనిపోయాడు.
తన కారణంగా భర్త చనిపోయాడని తెలిస్తే, ఉరి శిక్ష వేస్తారని ఆమె భయపడింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఏడవడం మొదలు పెట్టింది. ఎవరో నా భర్తను చంపేశారని చెప్పింది. దాంతో రాజు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఎవరో చంపేశారు నా భర్తని అని చెప్తుంది. ఎవరు చంపారో చెప్పమని రాజు అడుగుతాడు. నేను అతన్ని సరిగ్గా చూడలేదు. కానీ శివాలయం వైపు వెళ్ళాడని యువరాణి చెప్తుంది. శివాలయం వైపు అందరూ వెళ్తారు. అక్కడ ఎవరూ కనిపించరు. కేవలం బ్రాహ్మణుడు మాత్రం పూజలు చేస్తూ ఉంటాడు.
బ్రాహ్మణుడిని భటులు పట్టుకుని మహారాజుని నువ్వే కదా అని అడుగుతారు. నేను తనని చంపలేదు. నాకే ఏ పాపం తెలియదు అని బ్రాహ్మణుడు చెప్తాడు. కానీ ఎవరూ నమ్మరు. రాజు తన కొడుకు చనిపోయాడని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి.. నిన్ను నేను చంపలేను. కానీ ఏ చేత్తో అయితే నువ్వు నా కొడుకుని చంపావో అదే చెయ్యిని నేను నరికి వేస్తానని అతని చెయ్యి నరికేస్తాడు. దీంతో బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు.
నిర్దోషిని నేను. అయినా కూడా నాకు శిక్ష వేశారు. ఇక్కడ నేను ఉండను అని బ్రాహ్మణుడు మరొక రాజ్యానికి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడు ఎందుకు నాకు ఈ శిక్ష పడింది. నేను చేయలేదు కదా దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్తాడు. ఒక జ్యోతిష్యుడి ఇంటికి వెళ్లి అడుగుదామనుకునేసరికి జ్యోతిష్యుడు అక్కడ ఉండదు. ఆయన భార్య ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ జ్యోతిష్యుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి భార్య అతని మీద గట్టిగా కేకలు వేస్తుంది. ఎంత తిడుతున్నా కూడా ఒక్క మాట కూడా అనడు ఆ జ్యోతిష్యుడు.
అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎందుకు ఎంత తిడుతున్నా మీరు మాట్లాడటం లేదు అని అడుగుతాడు. ఆమె నా భార్య కదా. అది నేను చేసిన కర్మ. మనం చేసిన కర్మ వల్ల ఏ సంబంధాలైనా వస్తాయి. అనుభవించాలి. మంచైనా, చెడైనా మనమే అనుభవించాలి అని అంటాడు. మరి మీరు చేసిన పాపం ఏమిటి అని అడగగా…. నేను పూర్వ జన్మలో కాకి. నా భార్య గాడిద. ఆ గాడిదకి ఒక పుండు ఏర్పడింది. ఆ పుండును నేను నా ముక్కుతో పొడిచినప్పుడు గాడిదకి నొప్పి బాగా వచ్చేది. గట్టిగా అరిచింది. గాడిద పుండుకి నా ముక్కు అందులో చిక్కుకుపోవడంతో ఎంతలా ప్రయత్నం చేస్తున్నా రాలేదు.
ఎముకలో ఇరుక్కుపోయింది. నొప్పి తట్టుకోలేక గాడిద గంగా నది లోకి వెళ్ళింది. ఇలా గంగా నదిలో కాకి, గాడిద రెండు చనిపోయాయి. మరి నాకు ఇలా జరిగింది అని జ్యోతిష్యుడు తనకు జరిగింది చెప్తాడు. తరువాత మళ్లీ జ్యోతిష్యుడు పూర్వజన్మలో నువ్వు మునివి. రాజకుమారి ఆవు. రాజకుమారుడు ఓ కసాయివాడు. ఆవుని చంపడానికి రాజకుమారుడు వచ్చినప్పుడు ఆవు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది.
కత్తి పట్టుకుని కసాయివాడు దాని వెనకాల వస్తున్నాడు. ఎక్కడికి వెళ్లిందని అడిగితే నువ్వు వేలును చూపించావు. దాంతో కసాయి వాడు ఆవు వెనుక వెళ్ళాడు. ఇంతలో సింహం వచ్చి ఆవుని, కసాయి వాడిని తినేసింది. ఈ జన్మలో కసాయివాడు రాజకుమారుడుగా, ఆవు రాణిగా పుట్టారు. నువ్వు చేసిన కర్మ వల్లే నీకు ఇలా జరిగింది అని ఆ బ్రాహ్మణుడితో చెప్తాడు. ఇలా ఎవరు చేసిన కర్మలకు మళ్లీ జన్మలో వారు ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…