Rajayogam : శని మార్పు వల్ల కొన్ని రాశుల మీద ప్రభావం పడుతుంది. శని మార్పు వలన ఈ రాశుల వారికి అఖండ రాజయోగం కలగబోతోంది. నిజానికి శని ప్రభావం వలన ఒక్కోసారి మంచి జరగవచ్చు. ఒక్కో సారి చెడు కూడా జరగవచ్చు. మరి శని మార్పు వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి అఖండ రాజు యోగం కలగబోతుంది..? ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. అయితే ఈ 12 రాశులలో ఎవరికి శని మార్పు వలన మంచిగా మార్పు కలగనుంది అనేది చూసేద్దాం. మనం శని మార్పు వంటివి చూసి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? భవిష్యత్తులో కష్టాలు ఉండబోతున్నాయా..? ఆనందం ఉండబోతుందా..? జయం ఉండబోతుందా లేదా అపజయాలా..? వంటి విషయాలు తెలుసుకోవచ్చు. అయితే శని మార్పు కారణంగా ఇప్పుడు ఎవరికి రాజయోగం చోటు చేసుకోబోతుంది..? ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతోంది.. అనేది పండితులు చెప్పారు. చూసేయండి.

శని మార్పు వల్ల తుల రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థికపరంగా, న్యాయపరంగా ఇలా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉండబోతోంది. అయితే తులా రాశి వారి భార్య భర్తల్లో ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. శని కుంభ రాశిలోకి ప్రవేశించడం, గురువు మేష రాశిలోకి వెళ్లడం వలన ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ధనస్సు రాశి వారికి ఇక అనుకూలంగా ఉండబోతోంది. ఎనిమిది సంవత్సరాల నుండి కలుగుతున్న సమస్యలు అన్నింటికీ కూడా ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యల నుండి గట్టెక్కవచ్చు. విపరీతమైన రాజయోగం మీకు మొదలు కాబోతోంది. ఆర్థికంగా, కుటుంబం పరంగా, సామాజికపరంగా ఇలా అన్నింట్లో కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఇన్నాళ్ల నుండి మీరు పడుతున్న బాధలు అన్నీ కూడా ఇక మీదట ఉండవు.