Shami Tree For Money : హిందు ధర్మంలో కొన్ని రకాల మొక్కలను, చెట్లను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కలను చెట్లను కూడా చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ మొక్కలను, చెట్లను పూజించడం వల్ల దేవతల అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. దోషాలు కూడా తొలగిపోతాయి. హిందువులు పవిత్రంగా పూజించే మొక్కలల్లో జమ్మిచెట్టు కూడా ఒకటి. జమ్మిచెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దసరా నాడు ఈ మొక్కను ప్రత్యేకంగా పూజిస్తారు. శనిదోషాన్ని తొలగించే చెట్టు జమ్మిచెట్టు అని చెప్పవచ్చు. అలాగే జమ్మి చెట్టు గురించి రామాయణంలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పురాణాల్లో జమ్మిచెట్టుకు ఉన్న ప్రాధాన్యతను అలాగే ఈ చెట్టును పూజించడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రావణుడితో యుద్దం చేసే ముందు రాముడు జమ్మి చెట్టును పూజించాడని దీంతో యుద్దంలో శ్రీరాముడు విజయం సాధించాడని నమ్ముతారు. అలాగే శివుని పూజలో కూడా జమ్మి ఆకులను ఉపయోగిస్తారు. అదేవిధంగా శనివారం నాడు జమ్మి మొక్కను దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. శనివారం నాడు ఈ మొక్కను దానం చేయడం వల్ల సంతోషం, ఐశ్వర్యం కలుగుతుంది. చాలా మంది ఈ మొక్కను దానం చేయడం శుభప్రదంగా కూడా భావిస్తారు. జమ్మిచెట్టు దానం బంగారం దానం చేయడంతో సమానమని గ్రంథాలల్లో కూడా ఉంది. జమ్మిమొక్కను దానం చేసిన వారికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. అలాగే ఈ మొక్కను దానం చేయడం వల్ల జీవితంలో కొనసాగుతున్న అడ్డంకులు తొలగిపోతాయి.
జమ్మి మొక్కను దానం చేయడం వల్ల శనిగ్రహం యొక్క ఏనాళ్ల శని నుండి కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ విధమైన పరిహారాలు చేయడం వల్ల శని దేవుని కృపతో పాటు మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. జమ్మి చెట్టును దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నురాలై సంపదలను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా జమ్మి మొక్కను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి జీవితంలో ఉండే ఆర్థిక సంక్షోభాల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఈ విధంగా జమ్మి చెట్టుకు హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ మొక్కను పూజించడం వల్ల అలాగే దానం చేయడం వల్ల మనకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…