Hanuman Chalisa : హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతొ పూజించే దేవుళ్లలల్లో హనుమంతుడు కూడా ఒకటి. బజరంగబలి, అంజనీపుత్ర వంటి పేర్లతో హనుమంతుడిని పిలుస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో ఉండే కష్టాలు తీరి సుఖ సంతోషాలు లభిస్తాయి. హనుమంతుడి ఆశీస్సులు మనపై ఉండాలంటే మనం క్రమం తప్పకుండా హనుమంతుడిని పూజించాలి. హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి సులభమైన మార్గం హనుమాన్ చాలీసా పఠించడమే. ఎవరైతే హనుమాన్ చాలీసాను పూర్తి భక్తి శ్రద్దలతో పఠిస్తారో వారిపై హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం.
మనం తెలిసి తెలియక చేసే ఈ తప్పులే కొన్నిసార్లు మనం తీవ్ర నష్టాలకు గురి అయ్యేలా చేస్తాయి. కనుక మనం ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజించాలి. తరువాత రాముడు, సీతను పూజించి ఆ తరువాత హనుమాన్ చాలీసాను చదవడం ప్రారంభించాలి. అలాగే హనుమాన్ చాలీసాను ఎల్లప్పుడూ నేలపై కూర్చుని మాత్రమే చదవాలి. ఇక హనుమాన్ చాలీసా చదివేటప్పుడు స్వచ్చతను, పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. కనుక సుచి శుభ్రతలను పాటించిన తరువాతే హనుమాన్ చాలీసాను చదవాలి. అలాగే హనుమాన్ చాలీసాను 100 సార్లు చదవాలి. హనుమాన్ చాలీసాను 100 సార్లు ఎవరైతే పఠిస్తారో వారు బంధాల నుండి విముక్తి పొంది ఆనందాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మోక్షాన్ని పొందడానికి ఇది ఒక సులవైన మార్గం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనలో ఆధ్యాత్మిక బలం మరియు మనోబలం రెండూ పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మనపై చెడు కన్ను మరియు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఈ విధంగా తగిన నియమాలు పాటిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మనం ఎన్నో మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…