Nailing On Wall : మన పెద్దలు పూర్వకాలం నుంచి అనేక శాస్త్రాలను విశ్వసిస్తూ వస్తున్నారు. వాటిల్లో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు. ఎలాంటి దోషాలు కూడా ఏర్పడవని, ఆ ఇంటి సభ్యులు అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారని అంటారు. అందుకోసమే ఇంటిని నిర్మించేటప్పుడు లేదా కట్టి ఉన్న ఇంటిని కొనేటప్పుడు వాస్తు పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అయితే మీకు తెలుసా.. ఇంట్లో మనం చేసే చిన్న పనులు కూడా వాస్తు దోషాలకు, వాస్తు మార్పులకు కారణమవుతాయని. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఇంట్లో మనం అప్పుడప్పుడు గోడలకు మేకులు కొడుతుంటాం. మేకులకు ఏమైనా తగిలించుకోవచ్చని మనం మేకులను మనకు కావల్సిన గోడలకు కొడతాం. అయితే ఇలా గోడలకు మేకులు కొట్టడం అన్నది వాస్తు ప్రకారం మంచిదేనట. అవును, దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయని, కొత్త ఆదాయ మార్గాలు సమకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అయితే గోడలకు మేకులు కొట్టమన్నారు కదా అని అన్ని గోడలకు మేకులను కొట్టకూడదట. ఎందుకంటే ఇంట్లో కేవలం ఒకే దిశలో ఉన్న గోడకు మాత్రమే మేకులను కొట్టాలని, అప్పుడే పాజిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలు పోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఏ దిశలో ఉన్న గోడకు మేకులను కొట్టాలంటే.. దక్షిణం వైపు ఉన్న గోడకు మనం మేకులను కొట్టాల్సి ఉంటుంది.
దక్షిణం దిశ యమధర్మరాజుకు చెందుతుంది. అందువల్ల ఈ దిశలో ఉన్న గోడలకు మాత్రమే మేకులను కొట్టాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. డబ్బు సమస్యలు ఉండవు. అయితే ఎట్టి పరిస్థితిలోనూ తూర్పు వైపు ఉన్న గోడకు మేకులను కొట్టకూడదట. అలా చేస్తే ఇంట్లోకి ధారాళంగా నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తుందట. ఇది అనేక సమస్యలను కలగజేస్తుందట. కనుక గోడలకు మేకులు కొట్టే విషయంలో వాస్తు ప్రకారం ఎవరైనా సరే ఈ సూచనను తప్పక పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…